కొడుకులు పట్టించుకోవడం లేదని తల్లి ధర్నా

WGL: నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ ఆ కొడుకులకు బరువైంది. నువ్వంటే నువ్వంటూ వంతులేసుకొని ఆ కన్నతల్లిని వదిలించుకునే ప్రయత్నం చేయడంతో.. ఆత్మాభిమానం చంపుకోలేని ఆ వృద్ధురాలు కట్టుబట్టలతో గ్రామ పంచాయతీని ఆశ్రయించిన ఘటన ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.