బాణాసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి : SI

బాణాసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి : SI

KDP: దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా విక్రయాలకు తహసీల్దార్, పోలీసు, అగ్నిమాపక అధికారుల అనుమతితో పాటు లైసెన్స్ తప్పనిసరి అని SI మహమ్మద్ రఫీ తెలిపారు. గురువారం సిద్ధవటంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. ఎక్కడా బాణా సంచా పేలుళ్లు జరగకుండా ప్రశాంతంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్నారు. బాణాసంచా విక్రయాల సమయంలో వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.