డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
WNP: రాజపేట శివారిలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన రహదారి కలిసే కనెక్టివిటీ రోడ్ విషయం సహా, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలియజేయగా, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.