'తెరుచుకోనున్న కళాశాలల హాస్టళ్లు'

NLR: జిల్లాలోని బీసీ కళాశాల వసతి గృహాలను జూన్ 1 నుంచి ప్రారంభించాలని బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య ఆదేశించారు. 1వ తేదీ నుంచి కళాశాలలు పున:ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హాస్టళ్లను తెరిచి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.