డాక్టర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటాము

కృష్ణా: మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీని నిర్లక్ష్యం చేసిందని, అతి త్వరలో దానిపై సమావేశమై అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.