నేడు సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

నేడు సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

VSP: సింహాచలం సింహగిరి కొండదిగువనున్న వరాహ పుష్కరిణిలో ఆదివారం సింహాద్రి అప్పన్న వారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీ స్వామి వారు కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా వరాహ పుష్కరిణికి వేంచేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్సవానంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.