రైతుల మధ్య గట్టు పంచాదిలో ఇరువర్గాలు దాడి

MDK: పొలం గట్టు పంచాయితీలో ఇద్దరు రైతుల మధ్య గొడవకు దారి తీసి కొట్టుకునే వరకు వెళ్ళింది మెదక్ - సంగారెడ్డి ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన తుంగని మల్లయ్య, మొకిర మల్లయ్య అనే రైతుల మధ్య కొంత కాలంగా వివాదం ఉంది. పొలం గట్టు విషయంలో మంగళవారం ఇద్దరి మధ్య గొడవ పెరిగి కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.