అల్ ఫలాహా వర్సిటీ నుంచి 10 మంది 'మిస్సింగ్'..?
ఢిల్లీ పేలుడు తర్వాత అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన 10 మంది కన్పించకుండా పోయారని జాతీయ మీడియా తెలిపింది. ఈ వ్యక్తుల ఫోన్లు స్వీచ్ ఆఫ్‌లో ఉన్నాయని.. వీరిలో ముగ్గురు కశ్మీరీలు ఉన్నారని చెప్పింది. వీరికి ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో లింకులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే నిర్థారించలేమని వెల్లడించింది.