2027 చివరికల్లా నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి
HYD: నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో నిన్న సమీక్షించారు. 2027 చివరికల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. తొలి దశలో రూ. 327 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, దశల వారీగా స్టేషన్ రూపు రేఖలే మారుస్తామని స్పష్టం చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కై వాక్ ఏర్పాటు చేస్తామన్నారు.