ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి
అన్నమయ్య: చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలోని బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.