IPL చరిత్రలోనే ధోనీ అత్యుత్తమ కెప్టెన్: వాన్
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే చర్చపై ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, MS ధోనీ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ, తన ఓటు మాత్రం ధోనీకేనని అతడు స్పష్టం చేశాడు. IPL చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకున్న వాన్, కెప్టెన్సీ విషయానికి వస్తే ధోనీని మించిన వారు లేరని కొనియాడాడు.