మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: పీవీఎల్

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: పీవీఎల్

W.G: ఆకివీడు అన్వర్ మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పాల్గొన్నారు. విశ్వాసాలు వేరైనా ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అల్లా అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.