బాలల దినోత్సవ వేడుకలో పాల్గొన్న అధికారులు
NRML: నిర్మల్ మండలం కొండాపూర్ బాలసదనంలో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అవసరాలు, చదువు గురించి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు బట్టలు, దుప్పట్లు అందజేశారు.