ముగిసిన మండల స్థాయి క్రీడోత్సవాలు
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మై భారత్, ఎన్ వైకే ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్, షటిల్, చెస్, రన్నింగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు.