ధర్నాను విజయవంతం చేయాలి: సీతయ్య

తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రేపు మండల కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్‌పై నిరసన చేసిన కాంగ్రెస్ నాయకులు అదే విధానాలు కొనసాగిస్తున్నారన్నారు.