VIDEO: 'ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయాలి'
SRCL: ఆశాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం తీర్మానించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు.