సైన్యానికి మద్దతుగా ర్యాలీలు చేయాలి: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైన్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలోని బషీర్‌బాగ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. 'సైన్యానికి ఆత్మస్థైర్యం అందించాలని పూజలు చేశా. ఉగ్రవాదం అంతం కావాలని అమ్మవారిని కోరుకున్నా. దేశ ప్రజలంతా సైన్యం కోసం పూజలు చేయాలి. మద్దతుగా ర్యాలీలు చేపట్టాలి' అని పిలుపునిచ్చారు.