గుంతలమయంగా అడ్డగూడూరు - చౌల్లరామారం ప్రధాన రహదారి
BHNG: అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి చౌల్లరామారం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగ తయారై ప్రయాణికులకు శాపంగా మారింది. బస్టాండ్ సమీపంలోని కోటమర్తి రోడ్డు వద్ద పెద్ద గుంత ఏర్పడి నీరు నిలువడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ఎక్కువ వాహనాలు ప్రయాణిస్తుండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.