కాసేపట్లో షెడ్యూల్ విడుదల

కాసేపట్లో షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల షెడ్యూల్‌ను మరికాసేపట్లో ఈసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, జిల్లాల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయ్యింది. ఈ ఉత్కంఠ మధ్య ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ కుమార్ మీడియా సమావేశంలో పోలింగ్ తేదీల వివరాలను వెల్లడించనున్నారు.