వీధి కుక్కల నియంత్రణకు సుప్రీం సంచలన తీర్పు
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, స్కూళ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు వంటి ముఖ్య ప్రాంతాల్లో కుక్కలు తిరగకుండా చూడాలని స్పష్టం చేసింది. 'రాష్ట్రాలు తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. 8 వారాల్లోగా అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్‌లు పెట్టాలి. కుక్కలను పట్టిన చోటే తిరిగి వదలకూడదు' అని సూచించింది.