VIDEO: బిల్లులు కోసం RWS కాంట్రాక్టర్ల నిరసన
NTR: జిల్లా గొల్లపూడిలో ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద చిన్న కాంట్రాక్టర్ల అసోసియేషన్ నిరసన చేపట్టింది. బిల్లుల విడుదలలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మార్చి 19 నాటికి రూ.1600 కోట్లు విడుదలైనా తమ ఖాతాల్లో రూ.707 కోట్లు మాత్రమే జమయ్యాయని వాపోయారు. వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే కుటుంబాలతో కలిసి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.