తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

MBNR: ఓ కుమారుడు తండ్రిని గొడ్డలితో చంపిన ఘటన నవాబుపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బుచ్చయ్య(52) కుమారుడు యాదయ్య జిల్లాకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం బుచ్చయ్యకు నచ్చలేదు. ఆమెను సూటిపోటీ మాటలతో ఇబ్బందులు పెడుతున్నాడని యాదయ్య.. తండ్రిని, తల్లి మాసమ్మ కళ్లెదుటే గొడ్డలితో నరికి చంపాడు.