పాపన్నపేటలో వరద తీవ్రతను పరిశీలించిన ఆర్డీవో

MDK: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను మెదక్ ఆర్డీవో రమాదేవి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరు వనదుర్గమ్మ ఆలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీవో, తహశీల్దార్ సతీష్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా రక్షణ చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు.