శేఖర్ రెడ్డికి జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి

NLG: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డికి పదోన్నతి లభించింది. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శేఖర్ రెడ్డికి పదోన్నతి లభించడం పట్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.