చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు ఫైర్
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. 'చంద్రబాబు మొదటిసారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది' అని పేర్కొన్నారు.