బాలుడి కిడ్నాప్ యత్నం విఫలం
SRD: పట్టణంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ద్వారకానగర్‌లోని ఓ మైదానంలో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో ముగ్గురు దుండగులు ఓ బాలుడిని ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మిగిలిన పిల్లలు రాళ్లతో కొట్టి, కేకలు వేశారు. స్థానికులు గమనించడంతో దుండుగులు ఆ బాలుడ్ని వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.