'బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'
PPM: సమష్టి కృషితో బాల్య వివాహ రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ ప్రోబేషన్ ఆఫీసర్ పి.శ్రీధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం భద్రగిరి ప్రాజెక్టు పరిధిలో, పి.ఆమిటి గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల, టిక్కబాయ్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.