రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ప్రకాశం: పామూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. కనిగిరి(మం) నేలటూరి గొల్లపల్లికి చెందిన దాసరి నాగరాజు తమ పిల్లలతో వాహనంలో వెళ్తుండగా, పామూరు జాతీయ రహదారిపై టైరు పంచర్ అయ్యింది. దీంతో ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో దాసరి నాగరాజు భార్య నారాయణమ్మ మృతి చెందగా, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి.