ఆదర్శ దంపతులు అంటే వీరే..!
పెద్దపల్లి: జిల్లాకు చెందిన వరహగిరి శైలజ, వెంకటరావు దంపతులు సోమవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు. తమ పిల్లలు సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడినందున తమకు ఈ గృహం అవసరం లేదని, దీనిని వేరే నిరుపేద కుటుంబానికి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తిని తిరిగి అప్పగించిన శైలజ దంపతుల నిజాయితీని కలెక్టర్ ప్రశంసించారు.