రైతులకు ఎంఏఓ సూచనలు
NLR: విడవలూరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో గురువారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఏఓ లక్ష్మీ మాట్లాడుతూ... నారు పోసే ముందు రైతులందరూ తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ మేరకు సేంద్రీయ ఎరువులపై రైతన్నలు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.