సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం: ఎస్సై

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం: ఎస్సై

GDWL: సైబర్ మోసంలో రూ.6,500 కోల్పోయిన గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన పరమేశ్‌కు పోలీసులు ఆ డబ్బును తిరిగి ఇప్పించారు. ఈ విషయాన్ని గట్టు ఎస్సై కేటీ మల్లేష్ వెల్లడించారు. సైబర్ మోసంపై పరమేశ్ ఫిర్యాదు చేయగా, మండల పోలీస్ సైబర్ టీమ్ కేసును ఛేదించి, జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారంతో శనివారం ఆ మొత్తాన్ని బాధితుడికి రిఫండ్ చేయించింది.