పెనుగంచిప్రోలు తిరునాళ్లలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్
కృష్ణా: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాల్లో బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లాకు చెందిన పొలపాల రాజు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బ్లేడ్‌తో అతని పీక, ముఖంపై గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు వెంటనే 108 ద్వారా పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.