కుక్కలను బంధించిన మున్సిపల్ అధికారులు

ప్రకాశం: మార్కాపురం పట్టణ వ్యాప్తంగా కుక్కల బెడద ఎక్కువైందని పట్టణ ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని పలు వీధులలో కుక్కలను పట్టుకొని ఓ వ్యానులో ఎక్కించుకొని పట్టణానికి దూరంగా అరణ్య ప్రాంతంలో వదిలేస్తామని వారు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు చేపట్టిన చర్యలకు ప్రజలు అభినందనలు తెలిపారు.