ఇప్పపల్లిలో ఐస్‌క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ ఫ్లెక్సీల ఏర్పాటు

ఇప్పపల్లిలో ఐస్‌క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ ఫ్లెక్సీల ఏర్పాటు

JGL: కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలో ఐస్‌క్రీమ్ విక్రయించే బైకులు, ఆటోలకు నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గ్రామంలో ఐస్‌క్రీమ్ విక్రయించే వాహనాలు తిరిగితే రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ యువకులు తెలిపారు. ఈ ఫ్లెక్సీని సర్పంచ్ సంబ నవీన్, వార్డు సభ్యులు ఏర్పాటు చేశారు.