డ్వాక్రా నిధుల్లో గోల్‌మాల్.. లీడర్ అరెస్ట్
పల్నాడు: దాచేపల్లిలో డ్వాక్రా నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. యాసిన్ పొదుపు గ్రూపు లీడర్ నూర్జహాన్ రూ. 7 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో గురజాల జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.