పశువులకు గాలికుంటు టీకాలు

పశువులకు గాలికుంటు టీకాలు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిలో మంగళవారం పశువైద్య సిబ్బంది గేదెలకు, పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. అనంతరం సిబ్బంది మాట్లాడుతూ.. రైతులు ప్రతి ఒక్కరు పశువులకు, గేదెలకు టీకాలు వేయించాలని సూచించారు. పశువులకు టీకాలు వ్యాధులు రాకుండా కాపాడుతాయని తెలిపారు. టీకాలు వేయడంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయని రైతులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.