కన్నడ నటుడిని ఆశీర్వదించిన పీఠాధిపతి

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు కన్నడ సుపరిచిత నటుడు ధర్మ కీర్తి రాజ్ వచ్చారు. వారికి శ్రీ మఠం అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.