భూమి పూజ చేసి 20 ఏళ్లు.. ప్రారంభం కాని పనులు!

మేడ్చల్: మల్కాజ్‌గిరి వాజపేయి నగర్‌లో ROB, RUB పనుల కోసం భూమిపూజ చేసి ఇరవై ఏళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంపై ఎంపీ ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే కన్సల్టేటివ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికుల ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.