ఐదు గేట్ల ద్వారా 'పులిచింతల' నీటి విడుదల

SRPT: చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 1,55,464 క్యూసెక్కుల వరద వస్తుండగా ఐదు గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి 1,67,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.