శక్తి యాప్‌పై మహిళలకు పోలీసుల అవగాహన

శక్తి యాప్‌పై మహిళలకు పోలీసుల అవగాహన

NLR: మహిళల భద్రతే ధ్యేయంగా నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శనివారం జిల్లాలో శక్తి యాప్‌పై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమయంలో మహిళలకు రక్షణ కవచంలా నిలిచే ఈ యాప్‌ను ప్రతి మహిళా, విద్యార్థిని తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. శక్తి బృందాల ద్వారా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నారు.