‘ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరత’

TG: ఆపరేషన్ సింధూర్ వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని BJP MP రఘునందన్ రావు అన్నారు. యూరియా కొరత ఉందని కాంగ్రెస్, BRS పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న యూరియా రైతులకు ఇచ్చేది కేంద్రమేనన్నారు. రైతులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, యూరియాను సరఫరా చేసే బాధ్యత తమదని రఘునందన్ హామీ ఇచ్చారు.