కెప్టెన్ దీపికకు సీఎం సత్కారం
ATP: భారత అంధుల టీ20 కెప్టెన్ దీపికను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్‌లో ట్రోఫీ గెలవడం అభినందనీయమని కొనియాడారు. విజయవాడలో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో దీపికను సత్కరించి రూ. 10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.