ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం సింగారం గ్రామపంచాయతీలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే స్నేహపూర్వకంగా ముచ్చటించారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిని ఎమ్మెల్యే సమీక్షించారు.