చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి: ఎమ్మెల్యే

CTR: ఐరాల మండలం మదిపట్లపల్లిలో ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల ఆలయంలో ఆదివారం జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. దుర్యోధన వధ ఘట్టాన్ని వీక్షిస్తూ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని తెలిపారు. ఈ మేరకు సాంప్రదాయ నాటకాల ద్వారా సాంస్కృతిక వారసత్వం కొనసాగడం రాబోయే తరాలకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థుల కృషిని ఎమ్మెల్యే అభినందించారు.