మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్‌: స్టాలిన్‌

మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్‌: స్టాలిన్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టో సూపర్ స్టార్ వంటిదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. హామీలు ఎవరైనా ఇస్తారు కానీ, తమ పార్టీ ఇచ్చిన హామీలను మాత్రమే ప్రజలు నమ్ముతారని అన్నారు. అన్ని వయసుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు డీఎంకే మేనిఫెస్టోను ఇష్టపడతారని చెప్పారు. విశ్వసనీయత కలిగిన వ్యక్తుల వాగ్దానాలనే ప్రజలు విశ్వసిస్తారని స్టాలిన్ వెల్లడించారు.