'మీజిల్స్' టీకా అద్భుతం.. 6 కోట్ల ప్రాణాలు సేఫ్

'మీజిల్స్' టీకా అద్భుతం.. 6 కోట్ల ప్రాణాలు సేఫ్

తట్టు(మీజిల్స్‌) టీకా అద్భుతాలు సృష్టిస్తోంది. గత 24 ఏళ్లలో ఏకంగా 5.9 కోట్ల మంది పిల్లల ప్రాణాలను ఈ వ్యాక్సిన్ కాపాడిందని WHO తెలిపింది. మరణాల సంఖ్య 88% తగ్గడం విశేషం. 2000లో 7.7 లక్షల మంది చనిపోతే, గతేడాది ఆ సంఖ్య 95 వేలకు పడిపోయింది. అయితే మరణాలు తగ్గినా.. కేసులు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయని, వ్యాక్సినేషన్ ఇంకా పెరగాలని WHO సూచించింది.