సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
MBNR: జమాల్పూర్ గ్రామంలో ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై తిరుపాజి మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు పంపే లింకులు, ఓటీపీలు షేర్ చేయవద్దని గ్రామస్తులకు వివరించారు.