కొల్లేరు పరిరక్షణపై సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్

ఏలూరు జడ్పీ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. కొల్లేరు ప్రాంతంలో నీటి ప్రవాహం, డ్రైనేజ్ సమస్యలు, అక్రమ నిర్మాణాలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.