'ఎస్సీ యాక్షన్ ప్లాన్ దరఖాస్తు గడువు పొడిగింపు'
KMM: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు వాహనాలు, పాడి పశువులు, వ్యవసాయ యంత్రాల వంటి పథకాల కోసం tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.