'పెంచే స్థోమత లేని పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చు'
SRCL: పిల్లలను పెంచే స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలని, చట్టం ప్రకారం దత్తతకు పంపిస్తామని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రోడ్లపై పిల్లలను వదిలేసే బదులు, అవాంఛిత గర్భం వచ్చినవారు లేదా పిల్లలను పెంచలేనివారు ప్రభుత్వ నిర్దేశిత ప్రదేశాల్లో లేదా బాలల సంక్షేమ సమితి (CWC)కి అప్పగించాలని సూచించారు.